కోర్టు ఆదేశాలతో ఇటీవలే AP Government పోస్టింగ్ ఇచ్చిన AB Venkateswara rao పై మళ్లీ సస్పెన్షన్ వేటు పడింది. క్రమశిక్షణారాహిత్య వ్యాఖ్యలు, నేరపూరిత దుష్ప్రవర్తన కింద ఏబీని సస్పెండ్ చేస్తున్నట్లు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. గతంలో అవినీతి ఆరోపణలపై ఏబీ వెంకటేశ్వరరావును ప్రభుత్వం సస్పెండ్ చేయగా...కోర్టును ఆశ్రయించిన ఏబీ...న్యాయస్థానం ఆదేశాలతో తిరిగి ఇటీవలే విధుల్లో చేరారు. ఇప్పుడు మళ్లీ ఏబీ వేంకటేశ్వరరావుపై సస్పెన్షన్ వేటు పడటం చర్చనీయాంశంగా మారింది.